Telangana: తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఫైర్
- చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
- మోదీ, కిషన్ రెడ్డి కృషి వల్లే వచ్చిందన్న బీజేపీ
- తెలంగాణకు కిషన్ రెడ్డి ఇచ్చిన తొలి బహుమతన్న బండి సంజయ్
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై తెలంగాణ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ మండిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఈ గుర్తింపు లభించిందంటూ మంత్రులు ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి వల్లే కట్టడానికి ఆ ఖ్యాతి దక్కిందని పేర్కొంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఇచ్చిన తొలి బహుమతి ఇదేనని అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.