India: వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత్ పతకాల పంట... ప్రధాని మోదీ అభినందనలు
- బుడాపెస్ట్ లో వరల్డ్ క్యాడెట్ చాంపియన్ షిప్స్
- 5 స్వర్ణాలు సహా 13 పతకాలు సాధించిన భారత్
- రాణించిన భారత అమ్మాయిలు
- భవిష్యత్తులోనూ ఇదే ప్రదర్శన కనబర్చాలన్న ప్రధాని
హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ క్యాడెట్ చాంపియన్ షిప్స్ లో భారత రెజ్లర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 5 స్వర్ణ పతకాలు సహా మొత్తం 13 పతకాలు సాధించారు. ప్రియా మాలిక్ తో పాటు తన్నూ, కోమల్, అమన్ గులియా, పురుషుల రెజ్లింగ్ టీమ్ (సాగర్ జగ్లాన్, చిరాగ్, జైదీప్) కూడా పసిడి పతకం గెలిచారు.
దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత క్రీడాకారులు గర్వించేలా చేస్తున్నారని, వారి అమోఘమైన ప్రదర్శన కొనసాగుతోందని కితాబునిచ్చారు. హంగేరిలోని బుడాపెస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బృందాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ వారు అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.