Mahika Sharma: హీరోయిన్లను హై ప్రొఫైల్ వేశ్యలుగా, లైంగిక వస్తువులగానే చూస్తారు: మహికా శర్మ

Heroines does not have respect says Mahika Sharma
  • సినిమా అవకాశాలను ఆశగా చూపి లోబరుచుకుంటారు
  • నిలదొక్కుకోవాలంటే త్యాగం చేయక తప్పదని నాతో చాలా మంది చెప్పారు
  • హీరోయిన్లకు క్రేజ్ ఉంటుందే తప్ప, గౌరవం ఉండదు
సినీ పరిశ్రమలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే పలువురు మహిళా నటులు సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా నటి మహికా శర్మ దీనిపై స్పందించింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో హీరోయిన్లను లైంగిక వస్తువులగానే చూస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరు సినిమా అవకాశాలను ఆశగా చూపి లోబరుచుకుంటారని, మరికొందరు బలవంతం చేస్తారని చెప్పింది. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే త్యాగం చేయక తప్పదని తనతో చాలా మంది చెప్పారని తెలిపింది.

హీరోయిన్లను హైప్రొఫైల్ వేశ్యలుగా చూస్తారని మహికా శర్మ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా ఆర్టిస్టులకు క్రేజ్ ఉంటుందే తప్ప, గౌరవం ఉండదని... ఇది చాలా దారుణమని చెప్పింది. శిల్పాశెట్టి భర్త పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంపై స్పందిస్తూ... శిల్పను తామంతా ఒక స్ఫూర్తిప్రదాతగా చూస్తామని, ఆమె భర్త పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం చాలా బాధను కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.
Mahika Sharma
Bollywood
Casting Couch

More Telugu News