Engineering Student: విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Engineering student dies in suspicious conditions in Vijayawada
  • విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్చిన యువకుడు
  • ఆపై పోలీసులకు లొంగిపోయిన వైనం
  • తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చుతున్న అమ్మాయి తల్లిదండ్రులు
  • యువకుడు కొట్టడం వల్లే చనిపోయిందని ఆరోపణ
విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఈ నెల 23న తరుణ్ అనే యువకుడు ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తెడ్లం గ్రామం.

తరుణ్ నగరంలోనే ఓ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగి. కాగా, ఆమె తల్లిదండ్రులు తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తరుణ్ కొట్టడం వల్లే తమ కుమార్తె మరణించిందని వారు అంటున్నారు. తరుణ్ తమ కుమార్తెను ప్రేమ పేరుతో వంచించాడని ఆగ్రహం వెలిబుచ్చారు. ఆమెను 20 రోజులుగా తన గదిలోనే ఉంచి, హింసించాడని ఆరోపించారు.
Engineering Student
Death
Vijayawada
Police

More Telugu News