Murugadoss: సినీ దర్శకుడు మురుగదాస్ పై కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు

Madras HC gives relief to Murugadoss

  • 2018లో విజయ్ హీరోగా 'సర్కార్' సినిమా తీసిన మురుగదాస్
  • ప్రభుత్వ ఉచిత పథకాలను సినిమాలో ఎండగట్టిన వైనం
  • మురుగదాస్ పై హైకోర్టులో కేసు వేసిన అన్నాడీఎంకే కార్యకర్త

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు మురుగదాస్ కు మద్రాస్ హైకోర్టు ఊరటను కల్పించింది. వివరాల్లోకి వెళ్తే, స్టార్ హీరో విజయ్ తో 2018లో 'సర్కార్' అనే చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలను ఈ చిత్రంలో తీవ్రంగా విమర్శించారు. దీంతో, ఈ చిత్రంపై అప్పటి అన్నాడీఎంకే పాలకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో దేవరాజన్ అనే అన్నాడీఎంకే కార్యకర్త మురుగదాస్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో, సీసీసీబీ పోలీసులు మురుగదాస్ పై కేసు నమోదు చేశారు.

మరోవైపు ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు మద్రాస్ హైకోర్టు నుంచి మురుగదాస్ ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. దీనికి తోడు కేసును కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ... సెన్సార్ ను పూర్తి చేసుకున్న తర్వాతే ఈ సినిమా విడుదలయిందని... సెన్సార్ అయిన తర్వాత ఒక వ్యక్తి కానీ, ప్రభుత్వం కానీ కేసు పెట్టలేరని... ఈ పిటిషన్ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని తెలిపింది. పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు చెప్పింది.

  • Loading...

More Telugu News