WHO: వారం రోజుల్లో కరోనా మరణాలు 21 శాతం పెరిగాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

Corona deaths increased 21 percent world wide in last one week says WHO

  • వారం రోజుల్లో కరోనా కేసులు కూడా 8 శాతం పెరిగాయి
  • 69 వేలకు పైగా మరణాలు ఆగ్నేయాసియా దేశాల్లోనే నమోదయ్యాయి
  • ఇప్పటి వరకు 194 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి

ఇటీవలి కాలంలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి... ఇప్పుడు కొత్త వేరియంట్ల రూపంలో మళ్లీ పంజా విసురుతోంది. అనేక దేశాల్లో కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 21 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో దాదాపు 69 వేలకు పైగా మరణాలు ఆగ్నేయాసియా దేశాల్లోనే నమోదయ్యాయని తెలిపింది. అలాగే కరోనా కేసులు కూడా 8 శాతం పెరిగాయని పేర్కొంది.  

ఇక ఇప్పటి వరకు మొత్తం 194 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. రానున్న రెండు వారాల్లో కేసుల సంఖ్య 200 మిలియన్లను దాటేస్తుందని చెప్పింది. అమెరికా, ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, యూకేలలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. యూరప్ మినహా అన్ని దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయని చెప్పింది.

  • Loading...

More Telugu News