KTR: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సౌర ఫలకాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకం: కేటీఆర్

KTR inaugurates Premiere Energies Solar Cell and Modules manufacturing unit

  • తెలంగాణలో ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి
  • రూ.483 కోట్లతో సోలార్ పరికరాల ప్లాంట్
  • నేడు ప్రారంభించిన కేటీఆర్
  • త్వరలోనే ప్లాంట్ విస్తరణ

ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ తెలంగాణలో భారీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్ ను నెలకొల్పింది. హైదరాబాదులో ఈ ప్లాంట్ ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది, దేశంలో రెండో అతిపెద్దదైన సౌర ఫలకాలు, మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఈ సోలార్ పరికరాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

రూ.483 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మాణం జరుపుకుందని, ప్రస్తుతం దీంట్లో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. త్వరలోనే రూ.1,200 కోట్లతో విస్తరించి, 2000 మంది వరకు ఉద్యోగులకు అవకాశం కల్పించనుందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ ప్లాంట్ లో పర్యటించారు. ఉద్యోగులతో ఉల్లాసంగా ముచ్చటించారు.

ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థను 1995లో సురేందర్ పాల్ సింగ్ స్థాపించారు. సోలార్ సంబంధిత పరికరాలు తయారుచేసే ఈ సంస్థ భారత్ లోని పలు సంస్థలతో పాటు 30 దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది.

  • Loading...

More Telugu News