Corona Virus: రోగి శరీరంలోనే రూపు మార్చుకుంటున్న కరోనా కొత్త వేరియంట్లు

Corona variants change themselves in human bodies

  • గత ఏడాదిన్నరగా కరోనా వ్యాప్తి
  • ఇప్పటివరకు అనేక వేరియంట్ల గుర్తింపు
  • మనిషి దేహంలోనే మరో వేరియంట్ గా మార్పు 
  • సీసీఎంబీ, ఇతర పరిశోధకుల అధ్యయనం

గత ఏడాదిన్నర కాలంలో కరోనా వైరస్ మహమ్మారి అనేక విధాలుగా రూపాంతరం చెందుతోంది. కొత్త వేరియంట్ల రూపంలో ఇప్పటికీ మానవాళిపై విరుచుకు పడుతూనే ఉంది. అయితే హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇతర పరిశోధక సంస్థల శాస్త్రవేత్తలు ఆసక్తికర అంశాన్ని గుర్తించారు.

కరోనా వేరియంట్లు రోగి శరీరంలోనే తమ రూపు మార్చుకుంటున్నట్టు తెలుసుకున్నారు. కొత్త వేరియంట్లు ఇంత తీవ్రస్థాయిలో ఎలా ప్రభావం చూపగలుగుతున్నాయంటే, ఇదే కారణమని పరిశోధకులు వెల్లడించారు. ఒక్కో వేరియంట్ కు మధ్య విపరీతమైన తేడా ఉంటోందని పేర్కొన్నారు.

మనిషి శరీరంలోకి ప్రవేశించిన వైరస్ వివిధ మార్పులకు లోనవుతోందని తెలిపారు. ఒక్కసారి రూపం మార్చుకున్నాక, అవే మార్పులతో ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతోందని వివరించారు. కొత్త వేరియంట్లు విస్తృతంగా వెలుగు చూడడం వెనుక ఉన్న కీలక అంశం ఇదేనని తెలిపారు. కరోనా వైరస్ కణాల్లో 80 శాతం జన్యుమార్పిడి మానవ దేహంలోనే జరుగుతోందని, ఆపై ఇతరులకు సోకినప్పుడు అవే కొత్త వేరియంట్లుగా వెలుగు చూస్తున్నాయని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. మెడ్ఆర్ఎక్స్ఐవీ అనే జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

  • Loading...

More Telugu News