Google: బగ్స్ పై సమాచారం అందించేందుకు కొత్త వెబ్ సైట్ ప్రారంభించిన గూగుల్

 Google starts new website for bug hunters

  • బగ్స్ గుర్తించే వారికి భారీ నజరానాలు
  • పదేళ్లుగా వీఆర్పీ కొనసాగిస్తున్న గూగుల్
  • ఇక బగ్స్ హంటర్ పేరిట వెబ్ సైట్
  • వెబ్ సైట్ వేదికగా బగ్స్ కు సంబంధించిన కార్యకలాపాలు

సాఫ్ట్ వేర్ అన్న తర్వాత లోపాలు ఉండడం సహజం. టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఆ లోపాలను సరిదిద్దుతూ కొత్త వెర్షన్లు తీసుకువస్తుంటాయి. ఈ లోపాలను టెక్ పరిభాషలో బగ్స్ అని పేర్కొంటారు. ఈ బగ్స్ ను గుర్తించే వారికి భారీ మొత్తంలో నజరానాలు ఉంటాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ ఇలా బగ్స్ ను గుర్తించేవారి కోసం వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్ (వీఆర్పీ) పేరిట గత పదేళ్లుగా ఓ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వీఆర్పీ కోసం గూగుల్ కొత్త వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. ఈ వెబ్ సైట్ పేరు 'బగ్ హంటర్స్' (bughunters.google.com).

గూగుల్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్లలో బగ్ లను గుర్తించిన వారు ఈ వెబ్ సైట్ లో ఆ వివరాలను పొందుపరచవచ్చు. బగ్స్ ను గుర్తించే పోటీలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా ప్రకటిస్తారు. ఈ మేరకు గూగుల్ వర్గాలు తమ బ్లాగ్ పోస్టులో వివరించాయి.

గూగుల్, ఆండ్రాయిడ్, ఫిర్యాదులు, క్రోమ్, గూగుల్ ప్లే వంటి విభాగాలకు సంబంధించిన లోపాలను నివేదించడానికి ఇకపై బగ్ హంటర్స్ ఏకైక వేదికగా నిలుస్తుందని గూగుల్ వీఆర్పీ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్ జాన్ కెల్లెర్ వెల్లడించారు. కాగా, టెక్ కంపెనీలు బగ్ లను గుర్తించే వారికి లక్షల్లో నజరానా చెల్లిస్తుంటాయి. చాలామంది యువత దీన్నో హాబీగానూ కొనసాగిస్తుంటారు.

  • Loading...

More Telugu News