CBSE: కాసేపట్లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల విడుదల.. ఈ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు!

CBSE Class 12 Results To Be Announced Today

  • మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా ఫలితాల విడుదల
  • cbseresults.nic.in తో పాటు digilocker.gov.in వెబ్ సైట్లలో ఫలితాలు
  • డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలను విడుదల చేయనుంది. పరీక్ష ఫలితాలను సీబీఎస్ఈ అధికార వెబ్ సైట్ cbseresults.nic.in తో పాటు digilocker.gov.in వెబ్ సైట్ లో చూసుకునే వీలుంది. ఈ వెబ్ సైట్లలో విద్యార్థులు తన రోల్ నంబర్లను ఎంటర్ చేస్తే, ఫలితాలు కనిపిస్తాయి.

సీబీఎస్ఈ పాస్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు డిజిలాకర్ ప్లాట్ ఫామ్ లో లభిస్తాయి. ఈ సైట్ల ద్వారా విద్యార్థులు తమ డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో 12వ తరగతి విద్యార్థుల మార్కుల ఎవాల్యుయేషన్ ప్రక్రియను 13 మందితో కూడిన ప్యానెల్ రూపొందించింది. దీని ప్రకారం విద్యార్థులకు మార్కులను ఇలా కేటాయిస్తారు. 10వ తరగతి మార్కులకు సంబంధించి 30 శాతం వెయిటేజ్, 11వ తరగతికి సంబంధించి 30 శాతం వెయిటేజ్, 12వ తరగతికి సంబంధించి 40 శాతం వెయిటేజ్ ఉంటుంది. 12వ తరగతి మార్కులకు సంబంధించి యూనిట్ టెస్టులు, మిడ్ టర్మ్, ప్రీబోర్డ్ ఎగ్జామ్ లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

  • Loading...

More Telugu News