TTD: హనుమంతుడి జన్మస్థలంపై వెబినార్... వివరాలు తెలిపిన టీటీడీ అదనపు ఈవో

TTD conducts webinar on Lord Hanuman birthplace

  • హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రేనంటున్న టీటీడీ
  • త్వరలోనే పుస్తకం విడుదల
  • అన్ని ఆధారాలతో పుస్తకం
  • పండిత పరిషత్ ఏర్పాటు

హనుమంతుడి జన్మస్థలం తిరుమల గిరుల్లోనే ఉందని అంటున్న టీటీడీ, ఈ అంశంలో ఇప్పటికీ వివాదం తొలగకపోవడంతో తాజాగా వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాకు తెలిపారు. తిరుమల కొండల్లోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అని నిరూపిస్తూ త్వరలోనే పుస్తకం విడుదల చేస్తామని వెల్లడించారు. దీనిపై పండిత షరిషత్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

అంజనాద్రిలోనే హనుమంతుడు పుట్టాడన్నది వాస్తవం అని, ఆ విషయాన్ని నిరూపించే అనేక ఆధారాలు ఈ పుస్తకంలో ఉంటాయని ధర్మారెడ్డి వివరించారు. కాగా, టీటీడీ రెండ్రోజుల పాటు నిర్వహించిన వెబినార్ లో పీఠాధిపతులు, వేద పండితులు పాల్గొన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News