India Women Hockey Team: ఐర్లాండ్ ఓటమి... టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్స్ లో ప్రవేశించిన భారత మహిళల హాకీ జట్టు
- ఇవాళ దక్షిణాఫ్రికాపై నెగ్గిన భారత్
- ఐర్లాండ్-బ్రిటన్ మ్యాచ్ ఫలితం కోసం చూడాల్సిన వైనం
- ఐర్లాండ్ ఓడిపోవడంతో భారత్ కు నాకౌట్ బెర్తు
- క్వార్టర్స్ లో ఆసీస్ తో ఢీ
భారత మహిళల హాకీ జట్టుకు టోక్యో ఒలింపిక్స్ లో సమీకరణాలు కలిసొచ్చాయి. గ్రూప్ దశ దాటాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇవాళ దక్షిణాఫ్రికాపై నెగ్గిన భారత మహిళల జట్టు, ఆపై ఐర్లాండ్-బ్రిటన్ మధ్య గ్రూప్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ పోరులో ఐర్లాండ్ ఓడినా, మ్యాచ్ డ్రా అయినా అది భారత్ కే లాభిస్తుంది. భారత్ ఆశించినట్టుగానే ఈ పోరులో ఐర్లాండ్ ఓడిపోవడంతో గ్రూప్-ఏ నుంచి భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
క్వార్టర్ ఫైనల్లో భారత మహిళలు గ్రూప్-బిలో అగ్రస్థానం పొందిన ఆస్ట్రేలియాతో తలపడనున్నారు. 1980 తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇదే ప్రథమం.
అటు బాక్సింగ్ లో పూజారాణి ఓటమిపాలైంది. 75 కిలోల విభాగంలో చైనా బాక్సర్ లి ఖియాన్ చేతిలో ఓడిపోయింది.