Japan: ఒలింపిక్ నగరం టోక్యోలో కరోనా విజృంభణ.. ఒకే రోజు 4 వేలకు పైగా కేసులు

Over 4 thousand cases came to light in tokyo in one day
  • టోక్యోలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న కొవిడ్
  • క్రీడా గ్రామంలో తాజాగా 21 మందికి కరోనా
  • మలేషియా, థాయిలాండ్, అమెరికా, చైనాలో డెల్టా వేరియంట్ విజృంభణ
జపాన్ రాజధాని టోక్యోలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓవైపు ఒలింపిక్స్ జోరుగా సాగుతుండగా, మరోవైపు కరోనా చాపకింద నీరులా చుట్టుముడుతోంది. నిన్న ఒక్క రోజులోనే  ఏకంగా 4,058 కేసులు నమోదయ్యాయి. రాజధానిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్ క్రీడాగ్రామంలోనూ 21 మంది కొవిడ్ బారినపడ్డారు. జులై 1 నుంచి ఇప్పటి వరకు 241 మందికి కరోనా సోకింది. టోక్యోలో ప్రస్తుతం ‘అత్యవసర పరిస్థితి’ అమల్లో ఉంది. తాజా కేసుల నేపథ్యంలో మరో నాలుగు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.

మరోవైపు, థాయిలాండ్, మలేషియాలలో డెల్టా వేరియంట్ పడగ విప్పుతోంది. నిన్న థాయిలాండ్‌లో 18,912 మంది, మలేషియాలో 17,786 మంది కరోనా బారినపడ్డారు. థాయిలాండ్‌లో నమోదవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, చైనాలోనూ డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Japan
Tokyo
Olympics
Corona Virus
Delta Variant

More Telugu News