Raghav Chadha: ఉచిత విద్యుత్ వద్దు, మీరే కావాలన్న యువతి.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యే

Not On Manifesto Raghav Chadha After Twitter User Says She Wants Him
  • తాను మేనిఫెస్టోలో లేనన్న రాఘవ్ చద్దా
  • స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఎమ్మెల్యే
  • సోషల్ మీడియాలో వైరల్
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రాఘవ్ చద్దాకు ఓ యువతి.. ‘నాకు ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలి’ అని ట్వీట్ చేసింది. ఇది చూసిన ఎమ్మెల్యే రాఘవ్.. ఆమెకు చక్కని సమాధానం ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలో తాను లేనని, కేవలం ఉచిత విద్యుత్ మాత్రమే ఉందని బదులిచ్చారు.

అంతగా కావాలంటే పంజాబ్‌లో తాము అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి ఉచిత విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చూస్తానని బదులిచ్చారు. అనంతరం యువతి ట్వీట్‌ను తొలగించి స్క్రీన్‌‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  షేర్ చేయడంతో వైరల్ అయింది.
Raghav Chadha
Manifesto
Twitter
Free Electricity

More Telugu News