Prathipati Pulla Rao: చిలకలూరిపేటలో వందల లారీల మట్టి, ఇసుక తరలిపోతోంది: మాజీ మంత్రి ప్రత్తిపాటి
- ప్రశ్నిస్తే జైల్లో పెడతారా?
- కొండపల్లిలో అటవీ ప్రాంతంలో అక్రమాలు
- పరిశీలనకు వెళ్తే ఎందుకు అరెస్టులు చేస్తున్నారు?
- దేవినేని అక్కడకు వెళ్తే ప్రభుత్వానికి అభ్యంతరమేంటీ?
ఆంధ్రప్రదేశ్ సర్కారుపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? అని నిలదీశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొండపల్లిలో అటవీ ప్రాంతంలో జరుగుతోన్న అక్రమాల పరిశీలనకు వెళ్తే ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అక్కడ అక్రమాలు జరగట్లేదని ప్రభుత్వం అంటోందని, మరి తమ పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అక్కడకు పరిశీలనకు వెళ్తే ప్రభుత్వానికి అభ్యంతరమేంటీ? అని ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చిలకలూరిపేటలో వందల లారీల మట్టి, ఇసుక తరలిపోతోందని ఆయన ఆరోపించారు.