Telangana: కోర్టు ధిక్కరణ కేసులకు రూ.కోట్ల నిధులివ్వడం పట్ల తెలంగాణ సర్కార్​ పై హైకోర్టు ఆగ్రహం

High Court Anger Over Govt Releasing Funds For Contempt Cases

  • రూ.58 కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్న
  • ట్రెజరీ నిబంధనలు అనుమతిస్తాయా? అని నిలదీత
  • సీఎస్, వివిధ శాఖలకు నోటీసులు

కోర్టు ధిక్కరణ కేసుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై హైకోర్టు మండిపడింది. ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని నిలదీసింది. ఓ అధ్యాపకుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం విచారించింది.

కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు విడుదల చేశారని తెలిసి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అన్ని కోట్లు ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని, అందుకు ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ కు, రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News