Pawan Kalyan: క్రీడల్లో గెలుపోటములు సహజం: లవ్లీనా ఓటమిపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan responds on Lovlina lose in Tokyo Olympics
  • టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా ఓటమి
  • లవ్లీనా పోరాడి ఓడిందన్న పవన్
  • స్ఫూర్తిదాయక పోరాటమని కితాబు
  • దేశానికి మూడో పతకం అందించిందని ప్రశంస  
టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడాంశంలో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ సెమీస్ లో ఓటమిపాలైనప్పటికీ, ఆమె పోరాడిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లవ్లీనా ఇవాళ టర్కీ బాక్సర్, వరల్డ్ చాంపియన్ బుసానెజ్ సెర్మినెల్లి చేతిలో ఓడిపోయింది. దాంతో లవ్లీనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనాకు తన తరఫున, జనసేన తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న దశలోనే లవ్లీనా ఒలింపిక్స్ కాంస్యం దక్కించుకోవడం యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడల్లో గెలుపోటములు సహజం అని, అయితే ఎంత చిత్తశుద్ధితో పోరాడామన్నది ముఖ్యమని పవన్ పేర్కొన్నారు. లవ్లీనా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
Pawan Kalyan
Lovlina
Boxing
India
Tokyo Olympics

More Telugu News