Apple: వ్యక్తిగత జీవితంలోకి యాపిల్​ చొరబాటు.. ఐక్లౌడ్​, గ్యాలరీ, మెసేజ్​ లలో పంపే ఫొటోలన్నింటిపైనా నిఘా!

Apple Introduces Software That Scans All Your Photos In Your Phone
  • న్యూరోహాష్ సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసిన సంస్థ
  • చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టేందుకేనని సమర్థన
  • వ్యక్తుల ప్రైవేట్ లైఫ్ లోకి చొరబడడమేనంటున్న నిపుణులు
యాపిల్ అంటే భద్రతకు, గోప్యతకు మారుపేరు. అలాంటి యాపిల్ నుంచి మరో పటిష్ఠమైన భద్రతా ఫీచర్ వస్తోంది. అయితే, అది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందన్నది నిపుణుల వాదన. ఇవాళ యాపిల్ ఓ కొత్త సాఫ్ట్ వేర్ ను ప్రారంభించింది. దాని పేరు ‘న్యూరల్ హాష్’. చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టేందుకు యాపిల్ సంస్థ తీసుకున్న నిర్ణయమిది. అందులో భాగంగా ఇకపై యాపిల్ యూజర్ల ఫోన్లలో పిల్లలకు సంబంధించిన పోర్న్ ఫొటోలు ఏవైనా కనిపిస్తే కటకటాల వెనక్కు పంపిస్తారు.

ఎలాగంటారా? న్యూరల్ హాష్ అనే ఆ సాఫ్ట్ వేర్.. ఫోన్ మొత్తాన్ని స్కాన్ చేసేస్తుంది కాబట్టి. ఐక్లౌడ్, ఐఫోన్ గ్యాలరీలోని ఫొటోలన్నింటినీ స్కాన్ చేస్తుంది. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సైట్లు, మెసేజింగ్ మాధ్యమాల్లో పంపే ఫొటోలనూ జల్లెడ పడుతుంది. ఆ ఫొటోల్లో ఎక్కడైనా పిల్లల పోర్న్ ఫొటోలు కనిపిస్తే.. వెంటనే యాపిల్ సర్వర్లకు మెసేజ్ వెళ్తుంది. ఇంటర్నెట్ లో పిల్లల పోర్న్ ను వెతకకుండా అడ్డుకునే మరో ఫీచర్ ‘సిరి’ నూ జోడించారు. ఒకవేళ పిల్లల పోర్న్ కు సంబంధించిన ఫొటోలు, కంటెంట్ పెరిగిపోతోందని తేలితే.. యాపిల్ సంస్థ స్వయంగా వాటిని పరిశీలిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కటకటాల వెనక్కు నెట్టిస్తుంది.

చైల్డ్ పోర్నోగ్రఫీని అడ్డుకోవడానికి ఇది మంచి నిర్ణయమే అయినా.. యాపిల్ యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సందేశాలు, వ్యక్తిగత ఫొటోలను చూసేస్తామని, వ్యక్తిగత జీవితంలోకి చొరబడతామని యాపిల్ చెప్పకనే చెబుతోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీని అడ్డుకోవడం పక్కనపెడితే వ్యక్తులందరిమీదా గూఢచర్యం చేసే ప్రమాదమూ లేకపోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Apple
Neuro Hash
Privacy
Child Pornography

More Telugu News