Revanth Reddy: 'రాజీవ్ ఖేల్ రత్న' పేరు మార్చడంపై తీవ్రస్థాయిలో స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy gets anger after Union Govt changed Rajiv Khel Rathna name

  • అత్యున్నత క్రీడా పురస్కారంగా 'రాజీవ్ ఖేల్ రత్న'
  • 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చిన కేంద్రం
  • ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయన్న మోదీ
  • సంకుచిత బుద్ధి అంటూ రేవంత్ విమర్శలు

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా 'రాజీవ్ ఖేల్ రత్న'కు విశిష్ట గుర్తింపు ఉంది. అయితే, 'రాజీవ్ ఖేల్ రత్న'ను హాకీ యోధుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరిట 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వెల్లడించారు. ప్రజావిజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.

'రాజీవ్ ఖేల్ రత్న'ను 'ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీజేపీ, మోదీ సంకుచిత బుద్ధికి నిదర్శనమని విమర్శించారు. దేశంలో క్రీడాభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని రేవంత్ వెల్లడించారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డు కొనసాగించాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News