Andhra Pradesh: క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కారు

AP Cabinet meet details

  • పోలవరం నిర్వాసితులకు అదనంగా ప్యాకేజి
  • అసైన్డ్ భూముల చట్ట సవరణకు ఆమోదం
  • పలు కార్యాలయాలు కర్నూలు తరలింపు
  • నవరత్నాలపైనా చర్చ

ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, పోలవరం నిర్వాసితుల అంశం, నేత కార్మికులకు ఆర్థికసాయం, జగనన్న స్వచ్ఛ సంకల్పం, నవరత్నాల పథకాలపై ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాదు, పలు నిర్ణయాలకు క్యాబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు.

ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు...

  • పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం. అందుకోసం రూ.550 కోట్ల కేటాయింపు.
  • 1977 నాటి ఏపీ అసైన్డ్ భూముల చట్ట సవరణకు ఆమోదం.
  • అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం.
  • అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణకు ఆమోదం.
  • రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులు.
  • దగదర్తి (నెల్లూరు జిల్లా) ఎయిర్ పోర్టు పీపీపీ విధానంలో నిర్మాణానికి ఆమోదం.
  • ఈ నెల 13న వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాల ప్రదానం.
  • గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీగా మార్పు.
  • రాజమండ్రి పట్టణాభివృద్ధికి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు.
  • ఏపీలోని లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కార్యాలయాలు, హైదరాబాదులోని లోకాయుక్త కార్యాలయం కర్నూలుకు తరలింపు.
  • మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్‌ లకు క్యాబినెట్ ఆమోదం.
  • ధార్మిక పరిషత్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు.
  • రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు ఈ నెల 24న చెల్లింపులు.
  • వైఎస్సార్ నేతన్న నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం.

  • Loading...

More Telugu News