Rakul Preet Singh: వెబ్ సీరీస్ తో వస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preeth Singh in comedy web series
  • ఓటీటీ వేదికపై బిజీ అవుతున్న తారలు
  • కాజల్..సమంత..తమన్నా బాటలో రకుల్
  • కామెడీ వెబ్ సీరీస్ లో నటిస్తున్న భామ  
ఇవాళ మన కథానాయికలు సినిమాలతో ఎంత బిజీగా వున్నారో.. ఓటీటీ వేదికపై కూడా అంతే బిజీగా వున్నారు. కాజల్.. సమంత.. తమన్నా.. వంటి తారలు వెబ్ సీరీస్, రియాలిటీ షోస్ చేస్తూ బాగా బిజీగా వున్నారు. పారితోషికం పరంగా కూడా ఈ ఓటీటీ మాధ్యమం బాగా వర్కౌట్ అవుతుండడంతో మరింత మంది అటువైపు దృష్టి పెడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా గ్లామరస్ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కోసం రూపొందుతున్న హిందీ వెబ్ సీరీస్ లో రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఇది కామెడీ జోనర్ లో రూపొందే సీరీస్ అంటూ రకుల్ తాజాగా హింట్ ఇచ్చింది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంచితే, ప్రస్తుతం రకుల్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కొండపొలం' చిత్రంలోనూ, తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' సినిమాలోనూ నటిస్తోంది. ఇంకా హిందీలో 'అటాక్', 'మేడే', 'థాంక్ గాడ్', 'డాక్టర్ జీ' సినిమాలలో నటిస్తూ రకుల్ బిజీగా వుంది.  
Rakul Preet Singh
OTT
Web Series
Bollywood

More Telugu News