Bhajrang Punia: రెజ్లర్ భజరంగ్ పునియాకు రూ.2.5 కోట్ల నజరానా అందించనున్న హర్యానా ప్రభుత్వం

Haryana govt gives huge package to Bhajrang Punia after winning bronze in Tokyo Olympics
  • టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన పునియా
  • ఒలింపిక్స్ కు ముందే క్రీడా విధానం ప్రకటించిన హర్యానా
  • నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, స్థలం అందజేత
  • పునియా స్వగ్రామంలో ఇండోర్ స్టేడియం
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన భారత రెజ్లర్ భజరంగ్ పునియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, హర్యానా ప్రభుత్వం భజరంగ్ పునియాకు రూ.2.5 కోట్ల నజరానా అందించనుంది. దీనిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించిన క్రీడా విధానం మేరకు భజరంగ్ పునియాకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగం, 50 శాతం రాయితీతో స్థలం అందజేస్తామని వెల్లడించారు. భజరంగ్ స్వస్థలం జజ్జర్ జిల్లాలోని ఖుదాన్ ప్రాంతంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు.
Bhajrang Punia
Bronze
Tokyo Olympics
Cash Reward
Govt Job
Haryana Govt
India

More Telugu News