KCR: కేసీఆర్ కాన్వాయ్‌కు బైక్‌పై ఎదురెళ్లిన బాలలు.. పోలీసులు ఉరుకులు పరుగులు!
- కేసీఆర్ సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించి వస్తుండగా ఘటన
- రూ. 2 వేలకు బైక్‌ను కొనుగోలు చేసిన బాలలు
- పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు బైక్‌పై ఎదురెళ్లిన ఇద్దరు బాలలు హడలెత్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. కేసీఆర్ నిన్న సాయంత్రం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి వస్తుండగా ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 11, 14 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు బాలలు బైక్‌పై రాంగ్రూట్లో దూసుకుపోతూ ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు ఎదురెళ్లారు. వారిని పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
చిన్నారుల్లో ఒకరిది శాస్త్రిపురంగా, మరొకరు నిలోఫర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వారు ఆ బైక్‌ను రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి దానిపై తొలుత చార్మినార్‌కు వెళ్లారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్డువైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, వారు నడిపిన బైక్ చోరీకి గురైనట్టు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. చిన్నారులకు వాహనం అమ్మిన వారి కోసం ఆరా తీస్తున్న పోలీసులు.. బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.