ICMR: మిక్స్‌డ్ డోస్ వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు: తేల్చి చెప్పిన ఐసీఎంఆర్
- భారత్‌లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై ప్రయోగాలు
- ఎడినోవైరస్ వెక్టర్ ప్లాట్‌ఫారం ఆధారంగా కలిపి వేస్తే మంచి ఫలితాలు
- శరీరంలో ఇమ్యూనిటీ మరింతగా వృద్ధి
కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల వాడకంపై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రెండు రకాల వ్యాక్సిన్లను మిక్స్ చేసి వేయడం వంటి ప్రయోగాలు ఇప్పటికే పలు దేశాలు పూర్తి చేసి, ప్రజలకు వేస్తున్నాయి.
భారత్‌లోనూ కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) , పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి నిర్వహించిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. మిక్స్‌డ్ డోస్‌తో ఉత్తమ ఫలితాలు కనిపించాయని తెలిపారు.
ఎడినోవైరస్ వెక్టర్ ఆధారంగా ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి వేస్తే కరోనా నుంచి మరింత రక్షణ లభిస్తుందని చెప్పారు. శరీరంలో ఇమ్యూనిటీ మరింతగా వృద్ధి చెందుతుందని నిర్ధారించారు.