Manda Krishna Madiga: బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ... అపోలో ఆసుపత్రికి తరలింపు!
- ఆసుపత్రిపాలైన మంద కృష్ణ
- కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన నేత
- ఓ రెసిడెన్షియల్ కాంపెక్స్ లో జారిపడ్డ వైనం
- ఆసుపత్రికి తరలించిన అనుచరులు
కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్సులోని బాత్రూంలో ఆయన జారిపడడంతో గాయాలయ్యాయి. దాంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం మంద కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.