CBI: వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం ముగిసిన ఇవాళ్టి అన్వేషణ

CBI searches for weapons used in Viveka murder

  • వివేకా హత్య కేసులో సునీల్ అరెస్ట్
  • సునీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు
  • ఆయుధాల కోసం వాగులో అన్వేషణ
  • దక్కని ఫలితం
  • రేపు కూడా అన్వేషణ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందులలోని రోటరీపురం వాగులో నిన్నటి నుంచి అన్వేషిస్తున్నారు. ఇవాళ కూడా ఉదయం నుంచి ఆయుధాల కోసం శోధించిన అధికారులు వాగులో ఎడమవైపు అన్వేషించడం ముగించారు.

వాగులో మురికినీరు ఉండడంతో, 2 ట్యాంకర్లు, 20 మంది మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. యంత్రాలతో మట్టిని తొలగించి గాలించినా ఆయుధాల జాడ దొరకలేదు. కాగా, మున్సిపల్ సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రేపు కూడా వాగులో ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News