Andhra Pradesh: నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

 Arguments concluded on the petition filed challenging the appointment of Neelam Sahni
  • ఎస్‌ఈసీ నియామకాన్ని సవాలు చేసిన సాలూరు న్యాయవాది
  • వాదనలు వినిపించిన ఇరు వర్గాలు
  • తీర్పును వాయిదా వేసిన కోర్టు
ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిన్న హైకోర్టులో వాదనలు ముగిశాయి. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు ఇటీవల హైకోర్టులో కోవారెంట్ వ్యాజ్యం దాఖలు చేశారు.

నిన్న దీనిపై విచారణ ప్రారంభం కాగా, ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

Andhra Pradesh
AP High Court
Neelam Sahni
SEC

More Telugu News