TikTok: ఫేస్ బుక్ మెసెంజర్ ను వెనక్కి నెట్టిన టిక్ టాక్

Tik Tok beats Facebook Messenger with most downloads in world
  • గతేడాది అత్యధిక డౌన్ లోడ్లు పొందిన టిక్ టాక్
  • నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన మెసెంజర్
  • 2019లో నాలుగోస్థానంలో ఉన్న టిక్ టాక్
  • శరవేగంగా ఎదిగిన వైనం
వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రంగప్రవేశం చేసిన కొన్నాళ్లలోనే సోషల్ మీడియా దిగ్గజాలను వెనక్కి నెట్టే స్థాయికి చేరింది. డౌన్ లోడ్ల సంఖ్య పరంగా టిక్ టాక్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ అయింది. గతేడాది అత్యధికంగా డౌన్ లోడ్ అయిన యాప్ గా టిక్ టాక్ నిలిచింది. ఈ వీడియో షేరింగ్ యాప్ దెబ్బకు ఫేస్ బుక్ మెసెంజర్ ఐదో స్థానానికి పడిపోయింది.

అత్యధిక డౌన్ లోడ్లు పొందిన గ్లోబల్ టాప్-5 యాప్ లలో టిక్ టాక్ ఒక్కటే ఫేస్ బుక్ కు చెందనిది. మిగతా నాలుగు యాప్ లు ఫేస్ బుక్ కు చెందినవే. అవి ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్. వీటన్నింటిని అధిగమించిన చైనీస్ యాప్ టిక్ టాక్ వరల్డ్ వైడ్ పాప్యులారిటీతో దూసుకుపోతోంది.

2019లో డౌన్ లోడ్ల పరంగా టిక్ టాక్ నాలుగోస్థానంలో ఉంది. ఏడాది కాలంలో శరవేగంగా పైకి ఎగబాకింది. టిక్ టాక్ ను అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధించినప్పటికీ జోరు తగ్గకపోగా, మరింత ఎక్కువైంది. భారత్ లోనూ టిక్ టాక్ నిషేధం ఎదుర్కొన్నప్పటికీ, పేరు మార్చుకుని తిరిగి వచ్చేందుకు ఆ యాప్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
TikTok
Most Downloads
Facebook
Messenger

More Telugu News