Justice L Nageswara Rao: రేపు సుప్రీంకోర్టు కొలీజియంలోకి చేరనున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

Justice L Nageswara Rao set to join Collegium

  • నేడు రిటైర్ కానున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నారీమన్
  • ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలో రేపు చోటు
  • 6 జూన్ 2022 వరకు కొలీజియంలో కొనసాగనున్న జస్టిస్ రావు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు రేపు (13న) ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియంలో చేరనున్నారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారీమన్ నేడు రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ నాగేశ్వరరావుకు కొలీజియంలో స్థానం లభించనుంది. కొలీజియంలో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నారీమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు.

 కాగా, జస్టిస్ రావు 6 జూన్ 2022 వరకు కొలీజియంలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో ఇతర న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారాల వంటి వాటి కోసం కొలీజియం వ్యవస్థను న్యాయమూర్తులు స్వయంగా రూపొందించారు. వచ్చే వారం నాటికి సుప్రీంకోర్టులో పది న్యాయమూర్తుల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేయడం కొలీజయం తక్షణ కర్తవ్యం.

  • Loading...

More Telugu News