Sensex: ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు

Markets ends in profits

  • 318 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 82 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6.22 శాతం లాభపడిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి. వీక్లీ ఎఫ్ అండ్ ఓ గడువు ముగుస్తున్న తరుణంలో మార్కెట్లు హుషారుగా కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 54,844కి ఎగబాకింది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 16,364 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.22%), టెక్ మహీంద్రా (4.66%), టైటాన్ కంపెనీ (2.60%), ఎల్ అండ్ టీ (2.33%), ఎన్టీపీసీ (1.41%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.16%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.30%), యాక్సిస్ బ్యాంక్ (-0.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.22%).

  • Loading...

More Telugu News