Low Pressure: ఆగస్టు 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
- ఆగస్టు 15 నాటికి అల్పపీడన పరిస్థితులు
- ఆపై 48 గంటల్లో అల్పపీడనం
- ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు
- ఐఎండీ తాజా నివేదిక
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏపీకి వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 15 తర్వాత పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 15 నాటికి బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడుతుందని, అది బలపడి 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.