Nagachaitanya: వినాయక చవితికి 'లవ్ స్టోరీ' రిలీజ్!

Love Story will be released on Vinayaka Chavithi
  • శేఖర్ కమ్ముల నుంచి 'లవ్ స్టోరీ'
  • కరోనా కారణంగా ఆలస్యమైన రిలీజ్
  • వినాయక చవితికి థియేటర్లకు
  • త్వరలోనే అధికారిక ప్రకటన  
సున్నితమైన భావాలతో .. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఆయన నుంచి వచ్చిన 'ఆనంద్' .. 'గోదావరి' .. 'ఫిదా' సినిమాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి. అలాంటి ఒక అందమైన .. ఆసక్తికరమైన కథాకథనాలతో 'లవ్ స్టోరీ' రూపొందింది.

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసి ఉండేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వెళ్లింది. ఇటీవలే థియేటర్లు తెరుచుకున్నాయి.. చిన్న సినిమాలు లైన్లోకి వచ్చేస్తూనే ఉన్నాయి. థియేటర్ల దగ్గర కూడా జనం పెరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను వచ్చేనెల 10వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
Nagachaitanya
Sai Pallavi
Devayani
Rao Ramesh

More Telugu News