India: పన్నులు తగ్గిస్తాం సరే.. మరి, మీరేం చేస్తారు?: టెస్లాను వివరణ కోరిన కేంద్రం

Center Asks Tesla To Submit Detailed Manufacturing Report To cut Down Taxes
  • ఉత్పత్తి ప్రణాళికను ఇవ్వాలని ఆదేశం
  • సగం తయారు చేసిన వాహనాల దిగుమతిపై ప్రశ్నలు
  • అలాగైతే పన్నులు తగ్గుతాయని టెస్లాకు సూచన
దిగుమతి సుంకాలు, పన్నులను తగ్గిస్తే భారత్ లో విద్యుత్ కార్లను తయారు చేస్తామంటూ టెస్లా సీఈవో కోరుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను పలు విషయాలపై స్పష్టత కోరింది. పన్నులు తగ్గించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్న కేంద్రం.. ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికల గురించి సంస్థను ఆరా తీసినట్టు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది.

ఏం చేయదలచుకున్నారో సవివరంగా చెప్పాలంటూ టెస్లాను కేంద్రం కోరిందంటున్నారు. అంతకన్నా ముందు స్థానికంగా వాహనాల సమీకరణలో వేగం పెంచాల్సిందిగా సూచించిందని తెలుస్తోంది.

గత సమావేశంలోనే ఈ వివరాలను టెస్లాకు కేంద్రం తెలియజేసిందని ఆ అధికారి చెబుతున్నారు. పూర్తిగా తయారు చేసిన కార్లు లేదా సగం తయారు చేసి.. మిగతా సగాన్ని భారత్ లో అసెంబుల్ చేసే దానిపైనా అభిప్రాయం చెప్పాల్సిందిగా టెస్లాకు సూచించారని అంటున్నారు. దాని వల్ల దిగుమతి సుంకం తగ్గుతుందని చెప్పినట్టు సమాచారం. దీనిపై టెస్లా నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.
India
Tesla
Elon Musk
Electric Vehicles

More Telugu News