Revanth Reddy: నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి

Revanth Reddy attends court in note for vote case
  • ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరు
  • ఆయనతో పాటు ఉదయ్ సింహ, సెబాస్టియన్ కూడా హాజరు
  • నిన్న కొందరి వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాదులోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆయకు కోర్టుకు వచ్చారు. ఆయనతో పాటు ఉదయ్ సింహ, సెబాస్టియన్ కూడా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో రేవంత్ రెడ్డి పీఏ సైదయ్య, వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిల వాంగ్మూలాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు నిన్న నమోదు చేసింది. మరోవైపు నిన్నటి విచారణకు వేం నరేందర్ రెడ్డి బంధువుతో పాటు మరొకరు కూడా హాజరయ్యారు. వీరి వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.
Revanth Reddy
Congress
Note for Vote

More Telugu News