Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 55 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
- 593 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 165 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.22 శాతం పెరిగిన టీసీఎస్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. చరిత్రలో తొలిసారి 55 వేల మార్కును సెన్సెక్స్ దాటింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనే విధంగా ఇండిస్ట్రియల్ ఔట్ పుట్ డేటా రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో, సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఇక ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 55,437కి చేరుకుంది. నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 16,529కి ఎగబాకింది. టెలికాం, టెక్, కన్జ్యూమర్ గూడ్స్, ఐటీ సూచీలు భారీగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (3.22%), ఎల్ అండ్ టీ (2.78%), భారతి ఎయిర్ టెల్ (2.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.06%), టాటా స్టీల్ (1.83%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.28%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.09%), బజాజ్ ఫైనాన్స్ (-0.74%), ఎన్టీపీసీ (-0.63%).