Vishwak Sen: కొంతమందికి 'పాగల్' చూపించాను .. నా పేరు మార్చుకోనవసరం లేదన్నారు: విష్వక్సేన్
- థియేటర్లో చూస్తే కలిగే ఫీల్ వేరు
- ఫస్టాఫ్ అంతా నవ్వులే ఉంటాయి
- సెకండాఫ్ లో కన్నీళ్లు పెట్టనివాళ్లుండరు
- ఇంటికి వెళ్లాక కూడా సినిమా గురించే మాట్లాడుకుంటారు
విష్వక్సేన్ కథానాయకుడిగా బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో, నరేశ్ కుప్పిలి 'పాగల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో విష్వక్సేన్ మాట్లాడాడు.
"ప్రతి ఒక్కరి ప్రేమ కోసం 'పాగల్' ఎందుకు పరితపిస్తూ ఉంటాడనే ఒక ఎమోషనల్ ఎపిసోడ్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడుతూ .. 'మూసుకుపోయిన థియేటర్లన్నీ ఈ సినిమాతో తెరిపిస్తా, లేదంటే నా పేరు మార్చుకుంటాను' అన్నాను. ఆ తరువాత కొంతమంది దర్శకులకు .. వారి సన్నిహితులకు ఈ సినిమాను చూపించాను. వాళ్లంతా కూడా నువ్వు పేరు మార్చుకోవలసిన అవసరం రాదు .. సినిమా అంత బాగా వచ్చిందని గట్టిగా చెప్పారు.
ఈ సినిమాను థియేటర్లలో చూస్తే కలిగే ఫీల్ వేరు. అందువల్లనే అందుకోసం చాలా కష్టపడ్డాను. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా నవ్వుకోకుండా .. సెకండాఫ్ అంతా ఎమోషనల్ కాకుండా ఉండలేరు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా అంతా మాట్లాడుకునే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.