H-1B Visa: హెచ్-1బీ వీసా కార్యక్రమంలో 12 కంపెనీలపై అనర్హత వేటు వేసిన అమెరికా
- హెచ్-1బీ వీసాల వ్యవహారంలో అక్రమాలు
- ఉద్యోగ నియామకాల్లో మోసాలు
- మోసకారి కంపెనీలపై అమెరికా కొరడా
- నిర్దేశిత కాలావధితో నిషేధం
అమెరికా కార్మిక శాఖ హెచ్-1బీ వీసా జారీ కార్యక్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న 12 సంస్థలపై అనర్హత ముద్ర వేసింది. సదరు సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే క్రమంలో ఉద్దేశపూర్వకంగా తప్పిదాలకు పాల్పడ్డట్టు, ధ్రువపత్రాల నమోదులోనూ అవకతవకలకు పాల్పడ్డట్టు అమెరికా కార్మిక శాఖ గుర్తించింది. ఈ సంస్థలపై నిర్దేశిత కాలావధితో నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది.
అనర్హత ముద్ర పడిన కంపెనీలు ఇవే...
- అజిమెట్రీ
- క్లౌడ్ ప్రింట్
- హౌ వుయ్ ఫండ్ ఇట్
- కింబర్లీ ఫిషర్
- ముడియమ్
- రెడ్డీ రామేశ్వర్
- బీఐ సొల్యూషన్స్
- విజన్ సాఫ్ట్ ఇంటర్నేషనల్
- ఓపెన్ యాక్సెస్ టెక్నాలజీ ఇంటర్నేషనల్
- పారగాన్ స్కైడైవ్ ఎల్ఎల్సీ
- నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ
- ఇన్వెన్సిస్