Facebook: ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు వేసుకుంటే చింపాంజీలుగా మారతారంటూ ప్రచారం.. 300 ఖాతాలపై ఫేస్‌బుక్ వేటు

Facebook bans 300 Russian Accounts

  • ఇండియా, లాటిన్ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా ప్రచారం
  • 65 ఫేస్‌బుక్, 243 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై వేటు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమన్న ఫేస్‌బుక్

చింపాంజీ జన్యువుల ఆధారంగా ఆస్ట్రాజెనెకా టీకా తయారైందని, పరీక్షల్లో అది తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించిందని, ఆ టీకా వేసుకుంటే చింపాంజీలుగా మారిపోవడం ఖాయమంటూ ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఫేస్‌బుక్ స్పందించింది. ఫైజర్ వ్యాక్సిన్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. ఈ పోస్టులకు గతేడాది డిసెంబరు 14 నుంచి 21వ తేదీ మధ్య దాదాపు 10 వేలమంది హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. అలాగే, మీమ్స్, కామెంట్లు కూడా వచ్చాయి. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పోస్టులే కొన్ని ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. వాటితోపాటు ఆస్ట్రాజెనెకాకు చెందిన కొన్ని డాక్యుమెంట్లు కూడా కనిపించాయి.

ఈ దుష్ప్రచారంపై స్పందించిన ఫేస్‌బుక్ 300 ఖాతాలపై వేటేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారంతా రష్యన్లేనని.. ఇండియా, లాటిన్ అమెరికా ఖాతాదారులే లక్ష్యంగా  వారు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్టు గుర్తించింది. నిబంధనలను ఉల్లంఘించిన 65 ఫేస్‌బుక్ ఖాతాలు, 243 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించినట్టు ఫేస్‌బుక్ తెలిపింది.

  • Loading...

More Telugu News