Rahul Gandhi: ఇన్​ స్టాగ్రామ్​ లో రాహుల్​ పోస్ట్​.. ఫేస్​ బుక్​ కు బాలల హక్కుల కమిషన్​ నోటీసులు

NCPCR Summons Facebook Over Rahul Gandhi Post In Instagram
  • మంగళవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశం
  • చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం
  • ఢిల్లీలో దళిత బాలిక అత్యాచారం, హత్య
  • తల్లిదండ్రుల వివరాలను బయటకు వెల్లడించిన రాహుల్
తొమ్మిదేళ్ల దళిత బాలిక అత్యాచారం, హత్య ఘటనపై రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేయడంపై ఫేస్ బుక్ కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సమన్లు జారీ చేసింది. హతురాలి కుటుంబ వివరాలు బయటకు తెలిసేలా వీడియో పెట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. మంగళవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

ఢిల్లీలో జరిగిన ఘటనకు సంబంధించి హతురాలి తల్లిదండ్రులను రాహుల్ ఓదార్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే రాహుల్ ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. తిరిగి ఇవాళే పునరుద్ధరించింది. తాజాగా మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఫేస్ బుక్ ను బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది.

పోక్సో చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ గాంధీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫేస్ బుక్ కు ఆదేశాలిచ్చింది. అయితే, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rahul Gandhi
NCPCR
Facebook
Instagram

More Telugu News