KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డు నివేదిక
- ఇటీవలే ఎత్తిపోతల పనుల పరిశీలన
- అవసరానికి మించి ప్రాజెక్టు పనులు అంటూ ఆక్షేపణ
- నివేదికలో ఫొటోలు సహా ఆధారాలు
- త్వరలోనే నివేదిక ఎన్జీటీకి సమర్పణ
ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నివేదిక రూపొందించింది. కృష్ణా బోర్డు ఇటీవలే రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించింది. డీపీఆర్ తయారీ అవసరానికి మించి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని బోర్డు ఆక్షేపించింది. ఎత్తిపోతల పనుల వివరాలను ఫొటోలు సహా నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ఈ నివేదికలో అప్రోచ్ ఛానల్, పంప్ హౌస్, డెలివరీ మెయిన్, లింక్ కెనాల్, ఫోర్ బే, బ్యాచింగ్ ప్లాంట్ వంటి కీలక విభాగాల వివరాలు, నిర్మాణ సామగ్రి వివరాలు ఉన్నాయి. కాగా ఈ నివేదికను కేఆర్ఎంబీ... నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి సమర్పించనుంది.