Afghanistan: ఆఫ్ఘన్ లో తాలిబాన్ల దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన
- ఆఫ్ఘనిస్థాన్ పై తాలిబాన్ల పట్టు
- కాబూల్ తప్ప మిగతా భూభాగం వశం
- సరిహద్దులన్నీ తాలిబాన్ల స్వాధీనం
- సరిహద్దుల్లో భద్రత పెంచిన టర్కీ, ఇరాన్
ఆఫ్ఘనిస్థాన్ లో అత్యధిక భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబాన్లు ఇప్పుడు రాజధాని కాబూల్ ను హస్తగతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆఫ్ఘన్ లో మునుపటి కల్లోలభరిత పరిస్థితులు ఏర్పడడం పట్ల ఐక్యరాజ్యసమితి స్పందించింది. తాలిబాన్ల దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
అటు, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులన్నీ తాలిబాన్ల వశమయ్యాయి. ఈ నేపథ్యంలో టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. తాలిబాన్ల భయంతో దేశం వీడుతున్న ఆఫ్ఘన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో సరిహద్దులు దాటి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీ, ఇరాన్ చర్యలు తీసుకుంటున్నాయి.