Subramanian Swamy: మోదీ ఆర్థిక, విదేశాంగ విధానాలకు నేను వ్యతిరేకం: సుబ్రహ్మణ్యస్వామి

Subramanian Swamy said Modi is not king
  • మోదీకి వ్యతిరేకమా? అని ప్రశ్నించిన నెటిజన్
  • మోదీ భారతదేశానికి రాజు కాదన్న స్వామి
  • ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని వెల్లడి
  • జై శంకర్, దోవల్ పైనా వ్యాఖ్యలు
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అవసరమైతే సొంత పార్టీ నేతలను సైతం విమర్శిస్తుంటారు. మరోసారి అదే చేశారు. సార్ మీరు మోదీ వ్యతిరేకా? మీకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రధానిని వ్యతిరేకిస్తున్నారా? అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర జవాబు ఇచ్చారు. తాను మోదీ ఆర్థిక, విదేశాంగ విధానాలకు వ్యతిరేకినని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఏ అంశంపైన అయినా తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి మీరు ఎప్పుడూ వినలేదా? మోదీ ఏమీ భారతదేశానికి రాజు కాదు అని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.

అంతేకాదు, భారత విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పైనా విమర్శలు చేశారు. వారిద్దరూ జాతికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. జై శంకర్, దోవల్ అంతర్జాతీయ యవనికపై భారత్ ను ఘర్షణ పూరిత పరిస్థితుల్లోకి దింపారని విమర్శించారు. సమర్థులైన రాజకీయవేత్తల కంటే ఇలాంటివారినే మోదీ నమ్ముతారు కాబట్టే వీరిద్దరికీ మంచి పదవులు లభించాయని అభిప్రాయపడ్డారు. దాని ఫలితమే అన్ని పొరుగుదేశాలతో భారత్ కు ఇప్పుడు గొడవలు వచ్చిపడ్డాయని వ్యాఖ్యానించారు.
Subramanian Swamy
Narendra Modi
King
Anti Modi
BJP
India

More Telugu News