Tirumala: తిరుమలలో త్వరలో అందుబాటులోకి ‘సంప్రదాయ భోజనం’

Sampradaya Bhojanam will start at tirumala soon
  • గో ఆధారిత సాగు ద్వారా పండించిన సరుకులతో భోజనం తయారీ
  • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం
  • సెప్టెంబరు చివరినాటికి అలిపిరి మార్గం రెడీ
తిరుమలలో మరో నెల రోజుల్లో ‘సంప్రదాయ భోజనం’ అందుబాటులోకి రానుంది. గో ఆధారిత సాగు ద్వారా పండించిన సరుకులతో ఈ సంప్రదాయ భోజనాన్ని తయారు చేస్తారు. తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న తిరుమల, తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే అన్ని వసతి సముదాయాలు, అతిథి గృహాల్లోని గదుల్లో గీజర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సెప్టెంబరు చివరినాటికల్లా అలిపిరి నడకమార్గాన్ని పూర్తిచేస్తామన్నారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సహకారంతో మరో నాలుగు నెలల్లో పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపూ, ధూప్‌స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ తదితర 15 రకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆలయాల్లో వినియోగించే పుష్పాలతో తయారుచేసిన సుగంధ అగరబత్తీలను సెప్టెంబరు తొలి వారం నుంచి భక్తులకు విక్రయించనున్నట్టు తెలిపారు.
Tirumala
Tirupati
Sampradaya Bhojanam
KS Jawahar Reddy

More Telugu News