Suthapalli Devi: యూరప్ లోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన కాకినాడ యువతి

Kakinada girl Suthapalli Devi climbs Mount Elbrus

  • రష్యాలోని ఎల్ బ్రస్ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు
  • 4 రోజుల్లో అధిరోహించిన సుతాపల్లి దేవి
  • దేవి వయసు 23 సంవత్సరాలు
  • స్వాతంత్ర్య దినోత్సవం నాడే అధిరోహణ పూర్తి

రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ ను యూరప్ ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరంగా భావిస్తారు. కాకసస్ పర్వతశ్రేణిలో ఉండే ఎల్ బ్రస్ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఇంతటి సమున్నత పర్వతాన్ని ఓ తెలుగుమ్మాయి అధిరోహించడం విశేషం.

ఏపీలోని కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి మౌంట్ ఎల్ బ్రస్ ను కేవలం 4 రోజుల్లోనే అధిరోహించి ఔరా అనిపించింది. ఈ 23 ఏళ్ల అమ్మాయి ఎల్ బ్రస్ శిఖరాగ్రాన భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అందరి దృష్టిని ఆకర్షించింది. అది కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఆమె అధిరోహణ పూర్తికావడం చిరస్మరణీయ ఘట్టం. ట్రెక్కింగ్ అంటే ఎంతో ఆసక్తిచూపించే ఈ కాకినాడ యువతి తాజాగా ఎల్ బ్రస్ ను అధిరోహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News