Rains: రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
- వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో అల్పపీడనం
- రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
- నేడు, రేపు కొన్నిచోట్ల భారీ వర్షాలు
ఏపీ విపత్తుల శాఖ రాష్ట్రానికి వర్షసూచన జారీ చేసింది. రాగల 24 గంటల్లో వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. కొన్నిచోట్ల ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.