Taliban: అమెరికాకు సహకరించిన వారిపై తాలిబన్ల గురి.. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ!
- ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, అమెరికా బలగాలకు సహకరించిన వారి వివరాల సేకరణ
- భయంతో వణికిపోతున్న కాబూల్ వాసులు
- ఎప్పుడు ఎవరిని చంపుతారోనని వణుకుతున్న ప్రజలు
ఆఫ్ఘనిస్థాన్ లో ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే తాలిబన్ల అరాచకాలు ప్రారంభమయ్యాయి. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించబోమని ఓవైపు చెపుతూనే... మరోవైపు తమ మార్క్ చర్యలను ప్రారంభించారు. గత ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, అమెరికా సైన్యానికి సహకరించిన వారి వివరాలను తాలిబన్లు సేకరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను కనుక్కుంటున్నారు. దీంతో కాబూల్ వాసులు భయంతో వణికిపోతున్నారు.
రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా బతికిన కాబూల్ ప్రజలు... మళ్లీ తాలిబన్లు రావడంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లి చంపేస్తారో అనే భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్నారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేయడాన్ని తాలిబన్లు ప్రారంభించారు. దీనికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.