Jyothula Nehru: నిన్న స్వల్ప గుండెపోటుకు గురైన టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన నేతలు

TDP leader Jyothula Nehru sufferes from heart attack
  • నిన్న పొలంలో ఉండగా అస్వస్థతకు గురైన జ్యోతుల
  • రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తరలింపు
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
తెలుగుదేశం పార్టీ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గుండెపోటుకు గురయ్యారు. నిన్న సాయంత్రం పొలంలో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు.

మరోవైపు పలువురు టీడీపీ నేతలు ఈరోజు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయనను పరామర్శించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, రామకృష్ణారెడ్డి, గన్ని కృష్ణ, రాజా, ఎస్వీఎస్ అప్పలరాజు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా జ్యోతులను పరామర్శించారు. మరోవైపు నెహ్రూకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Jyothula Nehru
Heart Attack
Telugudesam

More Telugu News