Sensex: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets gains in 4th straight session

  • 210 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 52 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన టెక్ మహీంద్రా షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం తర్వాత ఐటీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాలను మూటగట్టుకున్నాయి. పర్యవసానంగా, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడి 55,792కి చేరుకుంది. నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 16,615కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.21%), నెస్లే ఇండియా (2.30%), టైటాన్ కంపెనీ (2.18%),  టీసీఎస్ (2.02%), ఇన్ఫోసిస్ (1.95%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.83%), ఎన్టీపీసీ (-1.43%), భారతి ఎయిర్ టెల్ (-1.25%), టాటా స్టీల్ (-1.16%), ఎల్ అండ్ టీ (-1.00%).

  • Loading...

More Telugu News