APEAP CET: ఏపీఈఏపీ సెట్: ఆగస్టు 19 నుంచి ఇంజినీరింగ్, సెప్టెంబరు 3 నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
- ఏపీలో ఆగస్టు 19 నుంచి ఏపీఈఏపీ సెట్
- నిర్వహణ కాకినాడ జేఎన్టీయూకి అప్పగింత
- రేపటివరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
- గతంలో ఎంసెట్ ఇప్పుడు ఏపీఈఏపీ సెట్
గతంలో ఎంసెట్ గా ఉన్న వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏపీఈఏపీ సెట్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించే ఏపీఈఏపీ సెట్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం కాకినాడ జేఎన్టీయూకి అప్పగించింది.
ఆగస్టు 19 నుంచి ఏపీఈఏపీ సెట్ జరగనుంది. ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష, సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నిర్వహించే ఏపీఈఏపీ సెట్ కు చైర్మన్ గా కాకినాడ జేఎన్టీయూ వీసీ రామలింగరాజు వ్యవహరించనున్నారు. కాగా, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది.