KL rahul: ఒకర్ని టార్గెట్ చేస్తే.. 11 మంది ఎదురుతిరుగుతాం: క్రికెటర్ కేఎల్ రాహుల్

If Ocar is targeted 11 people will oppose KL Rahul

  • లార్డ్స్ విజయం తర్వాత మాట్లాడిన ఓపెనర్
  • మైదానంలో మాటల యుద్ధంపై స్పందన
  • అది ఆటపై మంచి ప్రభావం చూపిందన్న రాహుల్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ చారిత్రాత్మక విజయం అందుకుంది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై 151 పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. ఈ విజయం అనంతరం భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. తమ జట్టులో ఎవరో ఒకరిని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తే.. వాళ్లపై మొత్తం 11 మంది ఎదురు తిరుగుతామని రాహుల్ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న రాహుల్.. తొలి ఇన్నింగ్సులో సెంచరీతో అద్భుతంగా రాణించాడు. మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన మాటల యుద్ధంపై రాహుల్ స్పందించాడు. ఈ రెండు జట్ల సభ్యుల మధ్య పలుమార్లు వాడివేడి సంభాషణలు జరిగాయి. ముఖ్యంగా ఆండర్సన్ బ్యాటింగ్ చేస్తుండగా.. అతన్ని బౌన్సర్‌తో అవుట్ చేయడానికి బుమ్రా ప్రయత్నించడంపై మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచి బుమ్రాను ఇంగ్లీష్ ఆటగాళ్లు టార్గెట్ చేయడం ప్రారంభించారు.

దీని గురించి రాహుల్ మాట్లాడుతూ.. ఇలా మాటల యుద్ధం జరగడం జట్టుపై మంచి ప్రభావం చూపిందని చెప్పాడు. రెండు జట్లలో మంచి పోటీతత్వం ఉన్నప్పుడు గొప్ప నైపుణ్యంతోపాటు, ఇలాంటి మాటల యుద్ధాలు కూడా కనిపిస్తూనే ఉంటాయని అన్నాడు.

‘‘ఏవో చిన్న గొడవలైతే మేం పట్టించుకోం. కానీ, మాలో ఒకరిని టార్గెట్ చేస్తే మొత్తం 11 మంది ఎదురుతిరుగుతారు’’ అని రాహుల్ హెచ్చరించాడు. ఇలా మాటల యుద్ధం జరగడం తమలో పట్టుదల పెంచిందని, ముఖ్యంగా బౌలర్లు మరీ ఉత్సాహంగా కనిపించారని రాహుల్ వివరించాడు. కాగా, తొలి ఇన్నింగ్సులో 129 పరుగులు చేసిన రాహుల్ పేరును లార్డ్స్ ఆనర్స్ బోర్డులో ఉంచారు. దీన్ని ప్రతిరోజూ చూసి పర్మినెంట్‌గా పెట్టేశారా? అనుకున్నానని రాహుల్ జోక్ చేశాడు.

  • Loading...

More Telugu News